శ్రీగంధం
శ్రీ గంధం లేదా చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. దీని శాస్త్రీయనామం శాంటాలమ్ ఆల్బమ్ (Santalum album). ఇది శాంటలేసి (Santalaceae) కుంటుంబానికి చెందినది.ప్రాచిన కాలంనుండి భారతదేశంలో వాడుకలో ఉన్నది. దీని పుట్టుక దక్షినభారతం, ప్రపంచ వ్యాప్తoగా ఉన్న గందపు మొక్కలలో భారతదేశ రకమైన శ్రీగంధం నుండి మాత్రమే అత్యధిక సుగంధ తైలం మరియు గంధం లభిస్తుంది. ఇప్పటి వరకు శ్రీగంధం మొక్కలను అడవుల నుండి సేకరిస్తూన్నందు వలన ఇవి అంతరించి పోయేస్తాయిలో ఉన్నాయి.
ఉపయోగాలు
santalum album seeds |
చందనం వ్యాధి నిరోధక శక్తిని మరియు మేధస్సును పెంచే గుణము కలది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, అతిసార వ్యాధులకు, మశూచి, స్ఫోటకము మరియు ఇతర చర్మవ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఉపయోగపడును. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు.
సాగువిధానం
santalum album plant |
మొక్కల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలి బాగా ఆరోగ్యంగా ఉన్నసేంద్రీయ పద్దతి లో పెంచిన రెండు సంవత్సరాల వయస్సు ఉన్నమొక్కలనే ఎంచుకోవాలి. చౌడు లేని ఎర్ర, నల్లని,ఇసుకతో కూడిన నీరు నిలువ ఉండని రకముల నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు, భారతదేశం అంతట గల వాతావరణం అనుకూలం . ఇది అడవులలో వర్షాధారంగా పెరుగుతుంది కనుక వర్షాకాలంలో తక్కువ నీటి ఆవశ్యకత కలది, వేసవిలో చిన్న వయస్సు మొక్కలకు రెండు సార్లు నీరు ఇవ్వాలి. శ్రీగంధం చెట్టు ఒక పరాన్న జీవన వృక్షం. ఇది భూమి నుండి నేరుగా కొన్ని పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని పోషకాలను గ్రహిస్తుంది. అందువలన శ్రీగంధం మొక్కలతో పాటు వేరే అతిథేయి మొక్కలను పెంచవలసి ఉంటుంది. అతిథేయి మొక్కలుగా కంది,మామిడి , ఉసిరి, సరుగుడు, కానుగ, మిరప, కరివేపాకు మొదలైనవాటిని పెంచవచ్చును. తగిన సమయంలో కలుపు నివారించాలి. సరైన యాజమాన్య పద్దతులు ద్వారా నాటిన నాల్ల్గవ సంవత్సరం నుండే విత్తనాలు కాస్తాయి.ఆరవ సంవత్సరం నుండి చెట్టుకు చేవ మొదలవుతుంది. ఈ చేవ నే గంధం అంటారు. బాగ ముదిరిన ఈ చెట్టు కర్ర మంచి సువాసన కలిగి వుంటుంది.15వ సంవత్సరంలో పంట తీసుకోవచ్చు, ప్రతీ మొక్క నుండి 25-30కిలోల చేవ లభిస్తుంది, ఈ చేవ మార్కెట్ లో కిలో 6000/-రూపాయలు ధర ఉంది. ఇతర భాగాల నుండి అదనపు ఆదాయం లభిస్తుంది.
ఆదాయం
ఒక ఎకరాకి 10 x 10 అడుగుల అంతరంలో 435 మొక్కలు నాటవచ్చు
ఒక ఎకరాలో 10% మొక్కలు చేతికి అందక పోయినా ?
santalum album 2years farm |
ఎకరాకి 390 x 25 = 9750 కిలోల చేవ దిగుబడి ఉంటుంది .
9750 x 6000 = 5,85,00,000రూపాయల ఆదాయం వస్తుంది.
మొక్కల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలి బాగా ఆరోగ్యంగా ఉన్నసేంద్రీయ పద్దతి లో పెంచిన రెండు సంవత్సరాల వయస్సు ఉన్నమొక్కలనే ఎంచుకోవాలి.
No comments:
Post a Comment